తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్ లో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్ లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.