సాగునీటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొత్త శకం: చంద్రబాబు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టుల పూర్తితో ఏపీలో కొత్త అధ్యాయం మొదలైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దశాబ్దాల కల సాకారమై ఉత్తరాంధ్ర, రాయలసీమ రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. తనను 'సీఈఓ సీఎం'గా కాకుండా, రైతులకు నీరందించిన 'వాటర్ మ్యాన్'గా గుర్తుంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టులు వ్యవసాయానికి కొత్త ఊపునిస్తాయని, తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇది కీలక ఘట్టమని ఆయన స్పష్టం చేశారు.