రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల సిబ్బందికి జిల్లా ఎస్పీ క్రీడా సామాగ్రి పంపిణీ
రిపోర్టర్: హరి
స్థలం: నాగర్ కర్నూల్
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు ఎంపికైన జిల్లా పోలీస్ సిబ్బందికి క్రీడా సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28 నుండి 30 వరకు క్లస్టర్ సి భాగంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ మరియు లాన్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడా వేడుకల్లో మన జిల్లా తరఫున పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోటీలకు వెళ్లే ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.