ప్లేవుడ్ కంపెనీలో కోర్ బెల్ పడి మహిళ మృతి

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం వద్ద ఉన్న సబూరి ప్లేవుడ్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికురాలు గజ్జి సుబ్బలక్ష్మి దుర్మరణం చెందారు. కంపెనీలో పనిచేస్తుండగా ఆమెపై కోర్‌ బెల్‌ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.