రాయలసీమ వీరుల స్ఫూర్తితో రణబాలి పాత్ర: దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వెల్లడి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

రాయలసీమ చారిత్రక వీరుల స్ఫూర్తితోనే రణబాలి పాత్రను సృష్టించినట్లు ఈ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వెల్లడించారు. విజయ్ దేవరకొండ, రశ్మిక జంటగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా డాక్యుమెంటరీ సిరీస్ లో భాగంగా మూడో ఎపిసోడ్ విడుదలయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, బొబ్బిలి నాగిరెడ్డి వంటి సీమ వీరుల త్యాగాలను స్మరిస్తూ ఈ కథను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.