ఆలుగడ్డలను ఫ్రిజ్లో పెడితే తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదని నిపుణుల హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
ఆలుగడ్డలను ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వీటిలోని పిండి పదార్థాలు రసాయనిక మార్పులకు గురై అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. దీనివల్ల వంటకాల రుచి మారడమే కాకుండా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వీటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.