పండ్లతోటల పెంపకంపై అవగాహన: బండార్లపల్లెలో ఉద్యానవన శాఖ ప్రత్యేక చైతన్య సదస్సు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పూతలపట్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండార్లపల్లె గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్లతోటల పెంపకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అవగాహన సంస్థ కళాబృందం సభ్యులు ఉద్యాన పంటల సాగు పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రోత్సాహక పథకాలపై కళారూపాల ద్వారా రైతులకు సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో కార్యాలయ ప్రతినిధి కుప్పస్వామి, టీమ్ లీడర్ రవికుమార్, ఉద్యానవన శాఖ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు విస్తృతంగా పాల్గొని అవగాహన పెంచుకున్నారు.