విజయవాడ ఉత్సవ్కు ప్రధాని మోదీ అభినందనలు: వైభవాన్ని చాటేలా నేటి నుంచి వేడుకలు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఉత్సవ్ రెండు పాయింట్ సున్నా వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. నగర సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా నిర్వహిస్తున్న ఈ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని నిర్వాహకులు స్పష్టం చేశారు.