ఆధునీకరించిన ఎఫ్ కే పాలెం చెరువును ప్రారంభించిన పవన్ కళ్యాణ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధునీకరించిన ఎఫ్.కె.పాలెం చెరువును అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసార లింక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చెరువుల ఆధునీకరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాగు, తాగునీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.