బ్యాంకు లింకేజీ రుణాల్లో విజయనగరం జిల్లా ప్రథమ స్థానం
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో విజయనగరం జిల్లా సత్తా చాటింది. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో 86.75 శాతం ప్రగతితో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మహిళలకు ఉపాధి కల్పించే కౌశలం కార్యక్రమంలోనూ 83 శాతం ఎంపిక రేటుతో అగ్రస్థానం దక్కించుకుంది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ విశేషాలను కలెక్టర్ రాంసుందర్రెడ్డి వెల్లడించారు.