సీఐ మృతిపై ప్రభుత్వ విమర్శలు తగదంటూ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: ప్రకాశం
సీఐ మృతిపై కొందరు ఉద్యోగులు కనీస మానవత్వం లేకుండా తప్పుగా మాట్లాడటం సరికాదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే ప్రభుత్వాన్ని నిందించడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. సర్వీస్ రూల్స్ లేకుండానే గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇప్పుడు వాటిని సరిచేసే బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం తీసుకుందని డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.