పాఠశాలలో మద్యం తాగుతూ పట్టుబడ్డ ప్రధానోపాధ్యాయుడు: గ్రామస్తుల ఆగ్రహం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆసిఫాబాద్
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మద్యం సేవించి తరగతి గదికి వస్తున్నాడని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల ఫిర్యాదుతో అప్రమత్తమైన గ్రామస్థులు హెచ్ఎం శ్రీనివాస్‌ను బడిలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మద్యం మత్తులో తూలుతున్న ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు స్థానికులు వెల్లడించారు.