నాన్ వెజ్ ప్రియులకు తీపి కబురు: భారీగా తగ్గిన చికెన్ ధరలు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియులకు ఊరట లభించేలా చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేశాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.300 వరకు పలికిన ధరలు, ప్రస్తుతం రూ.250కి పడిపోయాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో మార్కెట్లో చికెన్కు డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. దీనివల్లనే ధరలు భారీగా దిగివచ్చినట్లు పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.