మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్: కావలి గూడూరు అల్లూరులో నిలిచిపోయిన పోరు

రిపోర్టర్: సునీల్ స్థలం: నెల్లూరు

మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో కావలి, గూడూరు మున్సిపాలిటీలతో పాటు అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికల నిర్ణయం వెలువరించకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ జాబితాలో తమ ప్రాంతాల పేర్లు లేకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశ చెందారని వార్తలు వెలువడ్డాయి.