'టీచర్స్ డే రోజున మాజీ సైనికుడి కాలర్ పట్టుకుంటారా?': వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టీడీపీ నేతలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
ఉపాధ్యాయ దినోత్సవం రోజున మాజీ సైనికుడైన ఒక ఉపాధ్యాయుడి కాలర్ పట్టుకుని బెదిరించడం వైఎస్ జగన్ సాక్షిగా బరితెగింపునకు పరాకాష్ట అని టీడీపీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వైసీపీ తీరును, ఉపాధ్యాయుల పట్ల వారి వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.