విశాఖలో ఎంపీ లాడ్స్ నిధులతో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కలిసి గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డు వడ్లపూడి మైదానంలో రూ.20 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో అభివృద్ధి చేసిన నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వం కోసం క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.