సత్తుపల్లి డిపోలో బస్సులు బంద్: కండక్టర్ ప్రవళిక మృతితో కార్మికుల నిరసన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సత్తుపల్లి

మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికపై ప్రయాణికురాలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారని సత్తుపల్లి డిపో జెఏసి నాయకులు తెలిపారు. ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం డిపోలో బస్సులను నిలిపివేసి కార్మికులు నిరసన చేపట్టారు.