ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయమై విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడు అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Chennai

చెన్నై సమీపంలో సోమంగళం అటవీ ప్రాంతంలో పదహారేళ్ల ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన పంతొమ్మిదేళ్ల ఎలక్ట్రిషియన్ ముత్తుసామిని పోక్సో చట్టం కింద గుడువాంచేరి పోలీసులు అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాధితురాలితో పరిచయం పెంచుకుని, బైక్పై నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వారు పేర్కొన్నారు.