డిపాజిటర్లను మోసం చేసిన పోస్టుమాస్టర్ అరెస్టు
రిపోర్టర్: రాజేష్
స్థలం: శృంగవరపుకోట
డిపాజిటర్ల సొమ్మును స్వాహా చేసి నకిలీ ఖాతా పుస్తకాలు ఇచ్చిన పోస్టుమాస్టర్ బొమ్మరెడ్డిపల్లి ప్రసాద్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వి.నారాయణమూర్తి తెలిపారు. శృంగవరపుకోట మండలంలో బొడ్డవర బ్రాంచి పోస్టుమాస్టరుగా పనిచేస్తున్న సమయంలో ఖాతాదారుల నుంచి రూ.2.30 లక్షలు వసూలు చేసి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.