2027 వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికాతో బీసీసీఐ కీలక చర్చలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా సౌతాఫ్రికా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అక్కడి పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు కెప్టెన్ శుభ్ మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా, పాండ్యా వంటి కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్ మెంట్, ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వరల్డ్ కప్ కోసం పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.