ఎమ్స్ నార్సెట్-11 ప్రవేశ పత్రాలు విడుదల

రిపోర్టర్: రాము స్థలం: India

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎమ్స్) నార్సెట్-11 పరీక్షా ప్రవేశ పత్రాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 12న జరగనున్న ఈ ప్రాథమిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు నిర్దేశిత గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.