ఖైరతాబాద్‌లో వైభవంగా మహాగణపతి ఆగమన్‌ యాత్ర

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

ఖైరతాబాద్‌లో మహాగణపతిని ఆహ్వానిస్తూ స్థానిక యువజన సంఘం నిర్వహించిన ఆగమన్‌ కార్యక్రమం అత్యంత సందడిగా సాగింది. భారీ విద్యుత్తు దీపాల అలంకరణ, బ్యాండ్‌ మేళాల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ వినాయకుడిని ఘనంగా స్వాగతించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ కార్పొరేటర్‌ విజయారెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు.