పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్ సమీక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. గతంలో ఉన్న 84 వేల సంఖ్యను పెంచి, ఈసారి 2 లక్షల మందిని నమోదు చేయడమే లక్ష్యంగా నిర్దేశించారు. ఫారం-18 సమర్పించడానికి నవంబర్ 6 ఆఖరి తేదీ అని, డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.