ముఖ్యమంత్రి పీఠాన్ని ఎప్పుడూ ఆశించలేదన్న వైయస్సార్సీపీ నేత ధర్మాన
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైయస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నలభై ఐదు ఏళ్ల రాజకీయ ప్రయాణంలో తాను ఎన్నడూ సీఎం పీఠం ఆశించలేదని స్పష్టం చేశారు. కేవలం తన పేరు మాత్రమే ప్రచారంలోకి వచ్చిందని, పార్టీ విజయం కోసం మాత్రమే తాను నిరంతరం శ్రమిస్తున్నానని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తన గొంతు ఎప్పుడూ వినిపిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.