కాకినాడలో జగదీష్రెడ్డి హత్య కేసు: రెండోసారి పోలీసు కస్టడీకి ప్రధాన నిందితుడు సాదిక్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కాకినాడ

కాకినాడలో తీవ్ర సంచలనం సృష్టించిన జగదీష్రెడ్డి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేసినట్లు సర్పవరం అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ను మరింత లోతుగా విచారించేందుకు కోర్టు అనుమతితో పోలీసులు రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. హత్య వెనుక అసలు కారణాలు మరియు ఆర్థిక లావాదేవీల కోణంలో నిందితుడి ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.