'సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక బృందం': గురుగ్రామ్ రోడ్డు రేజ్ ఘటనపై పోలీసుల సిట్ ఏర్పాటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Gurugram

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టిన రోడ్డు రేజ్ ఘటనపై పోలీసులు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు కల్యాణ్ బైన్లా, లవ్నీష్‌లను రాజస్థాన్‌లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికీ రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.