మృతుడి కుటుంబం పరామర్శ
రిపోర్టర్: Ajay
స్థలం: మల్యాల
మల్యాల మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు దొంతర వేణి శేఖర్ వారి తండ్రి లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మె ల్యే సుంకే రవి శంకర్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామ ర్శించి ప్రకట సానుభూతి తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి, మాజీ ప్యాక్స్ చైర్మన్ సాగర్ రావు, నాయకులు గడ్డం రాజేశ్వర్, పోతరాజు శ్రీనివాస్, కట్కూరి అరుణ్, బట్టు నవీన్, జవ్వాజి శ్రీనివాస్, సంఘ సత్తన్న, పూడూరి చందు, రవి సలీం, వంగలి శ్రీనివాస్ తదితరులున్నారు.