కొత్తగూడెంలో ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.

రిపోర్టర్: హరి స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌లోని సింగరేణి జీఎం కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కొత్తగూడెం ఏరియా జీఎం సిహెచ్‌. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను అందజేసి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.