పసిడి ప్రియులకు భారీ ఊరట: దేశీయంగా తగ్గిన బంగారం ధరలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న పరిణామాల కారణంగా ఈ వారం బంగారం ధరలు స్థిరంగా ట్రేడయ్యే అవకాశం ఉందని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ రీసెర్చ్ అనలిస్ట్ వేదిక నర్వేకర్ వెల్లడించారు. పండగ సీజన్ కొనుగోళ్లు కొంత మద్దతు ఇస్తున్నప్పటికీ, డిమాండ్ మందకొడిగా ఉందని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, ముడిచమురు ధరల ప్రభావం ధరలపై ఉంటుందని విశ్లేషించారు.