పరిశ్రమల పేరుతో రైతుల పొట్ట కొట్టవద్దని కావలి రైతు సంఘం డిమాండ్

రిపోర్టర్: శివ స్థలం: కావలి

పరిశ్రమల పేరుతో కావలి రైతుల పొట్ట కొట్టవద్దని, రైతులకు కావాల్సిన నీరు అందించిన తర్వాతే పరిశ్రమలకు కేటాయింపులు జరపాలని కావలి రైతు సంఘం అధ్యక్షుడు ఇనమడుగు శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెద్ద చెరువు నీటిని ప్రాజెక్టులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. చెరువు నీటి మట్టాన్ని ప్రామాణిక స్థాయి కంటే తగ్గించి తోడితే తీవ్ర సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తూ, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.