భగవంతుడు సినిమా నుంచి రెండో పాట విడుదల చేసిన మేకర్స్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తిరువీర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా భగవంతుడు సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా రెండో పాటను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఓ యెల్లమ్మ అంటూ సాగే ఈ భక్తిభావం నింపిన గీతాన్ని దర్శకుడు జి.జి.విహారి స్వయంగా రాశారని, కేపీ స్వరపరచగా అడ్డుల జంగిరెడ్డి అద్భుతంగా ఆలపించారని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.