మల్కాజిగిరిలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇద్దరి అరెస్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మల్కాజిగిరి

మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ విక్రయిస్తున్న మహావీర్‌ సింగ్‌తో పాటు వినియోగదారుడు లక్ష్మణ్‌ సింగ్‌ రాజ్‌పురోహిత్‌ను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 23 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్‌ఫోన్లు, రూ.5,600 నగదుతో పాటు సుమారు రూ.2.76 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, పరారీలో ఉన్న కుల్దీప్, కైలాష్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.