జగన్ ఇంటి ముందే ధర్నా చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాబోయే 2029 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ప్రకటన చేర్చకపోతే వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందే ధర్నా చేస్తానని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన వైకాపా నాయకుల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటే, నేడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.