డిసెంబర్ 4న నాగచైతన్య ‘వృషకర్మ’ విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో నాగచైతన్య ట్రెజర్ హంటర్‌గా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు.