వృద్ధుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

కుటుంబానికి మరియు సమాజానికి వృద్ధులు అందించిన సేవలు అత్యంత విలువైనవని, వారిని ప్రేమతో ఆదరించి గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత స్పష్టం చేశారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల పోషణ మరియు సంక్షేమ చట్టంపై అందరికీ అవగాహన కల్పించామని ఆమె పేర్కొన్నారు.