పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు వినతి

రిపోర్టర్: గోపి స్థలం: కవలి

పట్టణంలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, రిటైర్డ్ అయిన వారి స్థానంలో వారి పిల్లలకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. డీఏ, పీఆర్సీ వర్తింపజేయాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు.