వాట్సాప్ యూజర్లకు భారీ ఊరట: బ్లూ టిక్ పడకుండా మెసేజ్ చదివే కొత్త ఫీచర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

వాట్సాప్ యూజర్ల కోసం ప్రముఖ సంస్థ సరికొత్త ఫీచర్ను తీసుకువస్తున్నట్లు డబ్ల్యూఏ బీటా ఇన్ఫో నివేదిక స్పష్టం చేసింది. ఈ ఫీచర్ ద్వారా చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్లు చదవచ్చునని టెక్ నిపుణులు వెల్లడించారు. దీనివల్ల అవతలి వారికి బ్లూ టిక్ కనిపించదని, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ఈ అప్డేట్ను గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉందని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి.