వైఎస్ వివేకా హత్య కేసు: ఈడీ విచారణలో దేవిరెడ్డి శివశంకర్రెడ్డి

రిపోర్టర్: కృష్ణ స్థలం: కడప

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు విచారించినట్లు సమాచారం. హత్య కోణంతో పాటు మనీలాండరింగ్ అంశాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. నలభై కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీల మూలాలపై అధికారులు ఆరా తీశారు.