ఐనవోలులో కూష్మాండదుర్గ అలంకారంలో భ్రమరాంభికా దేవి: విశేష పూజలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానంలో శ్రీ భ్రమరాంభికా దేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ సూక్త విధానంలో షోడశోపచార పూజ, లలిత సహస్రనామ పారాయణాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.