చైనా మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న సాత్విక్-చిరాగ్ జోడీ
రిపోర్టర్: విజయ్
స్థలం: World
చైనా మాస్టర్స్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి అద్భుత విజయం సాధించారు. చైనా జోడీపై హోరాహోరీ పోరులో 11-21, 21-13, 21-17 తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకున్నారు. తొలి గేమ్ కోల్పోయినా అద్భుతమైన కంబ్యాక్ తో ప్రత్యర్థిని చిత్తు చేసి దేశానికి చారిత్రక విజయాన్ని అందించారు.