అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పై పెరుగుతున్న సొంత పార్టీ ఒత్తిడి
రిపోర్టర్: శివ
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణమని సీఎన్ఎన్ కథనం వెల్లడించింది. స్పష్టమైన వ్యూహం లేకుండా దాడులకు ప్రోత్సహించిన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బాధ్యత వహించాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే హెగ్సెత్ పనితీరు అద్భుతంగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా సమర్థించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.