కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలపై పొన్నవోలు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: అమరావతి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.