బీసీ గురుకుల విద్యార్థులకు దసరా సెలవులు రద్దు: తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మరియు మైనారిటీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు దసరా సెలవులను రద్దు చేస్తూ యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయని అధికారులు తెలిపారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోసం ఈ నెల పదహారు వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో, పండుగకు ఇంటికి వెళ్లలేకపోతున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, అలాగే ఎస్సీ, ఎస్టీ గురుకులాల మాదిరిగా తమకూ సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.