పులివెందులలో ఉద్రిక్తత: పోలింగ్ కేంద్రం వద్ద దుండగుల అల్లర్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: పులివెందుల
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందే వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం తెల్లవారుజామున ముఖాలకు మాస్కులు ధరించిన దుండగులు అల్లర్లు సృష్టించారు. రోడ్లపై సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. ఏజెంట్లను అడ్డుకునేందుకు ఈ దాడి జరిగినట్లు సమాచారం కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.