'గ్రామపంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు': డీఎల్పీఓ సురేందర్
రిపోర్టర్: సతీష్
స్థలం: కామారెడ్డి జిల్లా
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేట్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఖాళీ స్థలాలను బుధవారం డివిజనల్ పంచాయతీ అధికారి సురేందర్ పరిశీలించారు. సర్వే నంబర్ 498లోని సుమారు 1.20 గుంటల భూమిలో పంచాయతీకి చెందిన స్థలంగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ స్థలాలను కొలతలు వేసి, బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తామని, ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాం హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి సలీం పాల్గొన్నారు.