ఐమెక్ కారిడార్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తి మద్దతు

రిపోర్టర్: రాము స్థలం: అమెరికా

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ నుంచి మొదలై పశ్చిమాసియా మీదుగా యూరప్ కు వెళ్లే ఐమెక్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికగా జీసీసీ సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌కు పట్టున్న జలసంధికి దూరంగా ఇంధన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.