కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఢిల్లీ

కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోయి రాజకీయ కుట్రలకు కేంద్రంగా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ ఓటర్లను తొలగించడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు బీజేపీతో ఆ సంస్థ కుమ్మక్కైందనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.