మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మెరిట్ అభ్యర్థులను పక్కనబెట్టి, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.