జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం.. బేషరతుగా విడుదల చేయాలి
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్ల అరెస్టును ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్. స్వామి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని, అరెస్టును చూపకుండా వేధించడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన ఆయన, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డీజీపీలు వెంటనే స్పందించి వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.