నెల్లూరులో దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అధికారుల దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: సతీష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు డివిజన్ పరిధిలో దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటుతో పాటు పాత లైసెన్సుల నవీకరణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీవో అనూష సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈనెల ఇరవై ఏడో తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు నగరంలోని ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తామని ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.